RRR సినిమా విషయంలో చిత్ర విచిత్రాలు అన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక సినిమాకు 2 రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. అయితే ఇప్పుడు వస్తాను.. లేకపోతే అప్పుడు వస్తాను అంటూ అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు రాజమౌళి. ట్రిపుల్ ఆర్ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ చాలా చేశారు. ప్రత్యేకంగా ఇప్పుడు మళ్లీ ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి సినిమా వస్తుందని దేశం అంతా తిరిగి అన్ని చోట్ల సినిమాను బాగా ప్రమోట్ చేశారు. అందుకే ప్రత్యేకంగా ఇప్పుడు మళ్లీ ప్రమోషన్ కార్యక్రమాలు పెట్టుకోవాలని దర్శక నిర్మాతలు ఎలాంటి ప్లాన్ చేయడం లేదు. అందుకే ఉన్న సినిమాను నేరుగా విడుదల చేయాలని చూస్తున్నారు.
కాకపోతే ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ కోసం సరైన విడుదల తేదీ కావాలి. సంక్రాంతి నుంచి వాయిదా పడటంతో సినిమా మళ్లీ సమ్మర్ తర్వాత వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అంతా చెప్పినట్లుగానే సమ్మర్కే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం రెండు విడుదల తేదీలు అనౌన్స్ చేశారు. మార్చి 18తో పాటు ఏప్రిల్ 28 డేట్స్ లాక్ చేశారు. నిజానికి ఈ రెండు డేట్స్ క్రేజీగా ఉన్నాయి. ఆ రోజు మిగిలిన సినిమాలు రావాలని చాలా వరకు ప్రయత్నిస్తున్నాయి. కానీ తన సినిమాను విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. ఇదే లేనిపోని కన్ఫ్యూజన్స్ కు దారి తీస్తుంది.
నిజానికి ఏప్రిల్ 28న నితిన్ మాచర్ల నియోజకవర్గం, ఎఫ్ 3 సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కానీ ఆ రోజు వచ్చిందంటే మిగిలిన సినిమాలు కచ్చితంగా వాయిదా పడతాయి. అలాగే మార్చి 18న ప్రభాస్ రాధే శ్యామ్ ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఏదేమైనా ఒక సినిమాకు రెండు విడుదల తేదీలు అనౌన్స్ చేయడం మాత్రం కాస్త కొత్తగా అనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో!!
RRR కారణంగా ఎన్టీఆర్ ఎంత నష్టపోయాడో తెలుసా..?
మాకు సినిమా వద్దు.. డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. RRR నిర్మాతకు కొత్త తలనొప్పి..
RRR | ట్రిపుల్ ఆర్ సినిమాపై మరో వివాదం.. ఈసారి ఏంటంటే?