RRR Mass Anthem Naatu Naatu song | అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ మంచి డ్యాన్సర్స్. వారి మాస్ స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లిపోతుంటాయి. ఇద్దరూ కలిసి చిందేస్తే అదొక ఆనందాల నృత్యహేల అవుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటతో ఆ అనందానుభూతిని అభిమానులకు పంచబోతున్నారు ఎన్టీఆర్, రామ్‌చరణ్. వారు కథానాయకులుగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలోని ‘పొలం గట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్లు.. పోలేరమ్మ జాతరలో పోతురాజు ఊగినట్టు..నా పాట సూడు..నా పాట సూడు నాటు నాటు. ఊర నాటు.. వీరనాటు’ అనే లీరికల్ వీడియోను బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఎం.ఎం కీరవాణి స్వరకర్త. ప్రేమ్క్ష్రిత్ నృత్యాలను సమకూర్చారు. ఈ లిరికల్ వీడియోలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నృత్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. స్వాతంత్య్రసమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవితాలకు కాల్పనిక అంశాలను జోడిస్తూ ఈ సినిమా తెరకెక్కుతున్నది. అలియాభట్, అజయ్‌దేవ్‌గణ్, శ్రియ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న ఈ చిత్రం విడుదలకానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR: షూట్ గ్యాప్‌లో చిల్ అవుతున్న మాస్ కా మాస్టర్స్
Alia bhatt | అమ్మో రెండేండ్లలో ఆలియాభట్ అంత సంపాదించిందా?
Rajamouli | పవన్ కళ్యాణ్‌తో సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rajamouli: థియేటర్స్ కోసమే సినిమాలు చేస్తానని చెప్పిన రాజమౌళి