టాలీవుడ్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (K Raghavendra Rao) పర్యవేక్షణలో వస్తున్న చిత్రం పెండ్లి సందD (Pelli SandaD). ఈ చిత్రానికి గౌరీ రోనంకి (Gowri Ronanki ) దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. 50 సెకన్ల నిడివిలో ఉన్న టీజర్ లో హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్, కుటుంబ భావోద్వేగాలు, వినోదం, యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. టీజర్ తో ప్రేక్షకులపై ప్రభావం చూపించేందుకు ప్రయత్నించారు గౌరీ రోనంకి.
శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan) హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 24న లేదా అక్టోబర్ 1న సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. రాఘవేంద్రరావు ఈ సినిమాతో తొలిసారి నటుడిగా పరిచయమవుతుండటం విశేషం. వశిష్ట పాత్రలో కనిపించబోతున్నారు ఆయన.
ఆర్కే ఫిలిమ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Bheemla nayak: ఇక వరుస సర్ప్రైజ్లతో సందడి చేయనున్న రానా..!