Ranveer Singh | హగ్ ఆలియాకు ఇవ్వు.. నాకు ఝుంకాలు ఇవ్వు : రణ్వీర్ సింగ్
Rocky Aur Rani Ki Prem Kahani | రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.
Rocky Aur Rani Ki Prem Kahani | రణ్వీర్ సింగ్ (Ranveer Singh), ఆలియా భట్ (Alia Bhat) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ (Dharma productions) పతాకంపై కరణ్ జోహార్ (Karan Johar) స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. చక్కటి ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా తనదైన శైలి మేకింగ్‌తో కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని సమాచారం. కాగా ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా.. ఈ ఆన్-స్క్రీన్ జంట ఢిల్లీలోని వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే ఆలియాకు ఓ అభిమాని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.
ప్రమోషన్స్ (Rocky Aur Rani Ki Prem Kahani Promotions) లో భాగంగా జరిగిన ఈవెంట్లో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంట అభిమానులను పలకరిస్తుండగా.. ఓ అభిమాని సడన్‌గా వచ్చి ఆలియాకు ఝుమ్‌కాస్ (Jhumkas) గిఫ్ట్ ఇచ్చాడు. అయితే అభిమాని అలియాకు ‘ఝుమ్‌కాస్’ బహుమతిగా ఇవ్వడంతో, రణ్వీర్ ఆ అభిమానికి తిరిగి ఏమి కావాలని అడిగాడు. దీంతో ఆ ఫ్యాన్ స్పందిస్తూ.. రణ్వీర్ను హగ్ చేసుకుంటానని తెలిపాడు. దీనిపై రణ్వీర్ సింగ్ సరదగా స్పందిస్తూ.. “తు హగ్ అలియా కో దేదే, ఝుమ్కా ముఝే దేదే. తేరీ భాభి బాహోత్ ఖుష్ హో జాయేగీ (ఆలియాను కౌగిలించుకో, నాకు ఝుంకాలు ఇవ్వు.. మీ వదిన (దీపికా పదుకొనే) ఖుషీ అవుతుంది) అని రణ్వీర్ ఫన్నీ రిప్లయ్ ఇచ్చాడు. ఇక ఈ చిత్రంలోని ‘వాట్ ఝుమ్కా పాట ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ధర్మ ప్రొడక్షన్స్ పతాకం (Dharma productions) పై నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకులు ముందుకు రానుంది. దాదాపు ఆరేండ్ల విరామం తర్వాత కరణ్‌జోహార్ (Karan johar) దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం..‘గల్లీబాయ్ (Gully Boy)’ చిత్రం తర్వాత రణ్వీర్ – అలియా జోడీ నటించిన చిత్రమిదే కావడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ చక్రవర్తి (Pritam Chakraborty) స్వరాలు అందిస్తుండగా.. బాలీవుడ్ లెజెండ్ నటుడు ధర్మేంద్ర (Dharmendra), ప్రీతి జింటా(Preety jinta), అంజలి ఆనంద్ (Anjali Anand), షబానా అజ్మీ (Shabana Azmi) తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
and so it begins… #RockyAurRaniKiiPremKahaani in Vadodara 💕 pic.twitter.com/oD1gw17H0b
— Alia Bhatt (@aliaa08) July 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

