Ramayana | రణబీర్‌కపూర్ రాముడి పాత్రలో నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘రామాయణ’ భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న చిత్రంగా రికార్డు సృష్టించనుంది. మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ముంబయిలో మొదలైంది. సీత పాత్రలో సాయిపల్లవి నటిస్తుండగా, రావణాసురుడిగా కన్నడ అగ్ర నటుడు యష్ కనిపించనున్నారు. వివిధ భాషలకు చెందిన అగ్ర నటులు ఈ సినిమాలో భాగం అవుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం తొలి భాగానికే దాదాపు 830 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారని తెలిసింది. గ్లోబల్ ఆడియెన్స్‌ను మెప్పించే లక్ష్యంగా అత్యున్నత సాంకేతిక హంగులతో విజువల్ ఫీస్ట్‌లా ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకే ఏడాదికిపైగా సమయాన్ని వెచ్చించబోతున్నారని ముంబయి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రణబీర్‌కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని దాదాపు 450 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో అదే హయ్యస్ట్ బడ్జెట్. తాజాగా ‘రామాయణ’ ఆ రికార్డు బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నది.