Tollywood | సోమవారం జరిగిన తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ, కుమార్తెతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అగ్ర దర్శకుడు రాజమౌళి.. భార్య రమా రాజమౌళి, కుమారుడు కార్తికేయతో కలిసి షేక్‌పేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకొని నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశాను’ అని రాజమౌళి ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. వీరితో పాటు అగ్ర హీరోలు మోహన్‌బాబు, మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, మంచు విష్ణు, నాగచైతన్య, కల్యాణ్‌రామ్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తారలందరూ సోషల్‌మీడియా వేదికగా సందేశాలను అందించారు.