RJ Kajal Game plan| కాజల్ గేమ్ ప్లాన్‌కు అంతా ఫిదా..మామూలు కన్నింగ్ కాదట..!
బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss Telugu season 5) మొదలై దాదాపు 90 రోజులు అవుతుంది. ఇప్పటికే 12 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss Telugu season 5) మొదలై దాదాపు 90 రోజులు అవుతుంది. ఇప్పటికే 12 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మరో మూడు వారాల్లో షో ముగిసిపోతుంది. అయితే ఈసారి వచ్చిన 19 మంది కంటెస్టెంట్స్ (Bigg boss 19 contestants)లో ఒకరి గురించి మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఇంట్లో కూడా ఆ కంటెస్టెంట్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. రెండు మూడు సార్లు నాగార్జున కూడా ఆమెపై సీరియస్ అయ్యాడు. తన గేమ్ ప్లాన్, అలాగే స్ట్రాటజీతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది ఆమె. ఇంట్రడక్షన్ అంతా చూసిన తర్వాత ఎవరో ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఆ కంటెస్టెంట్ ఆర్జే కాజల్ (RJ Kajal). తన జీవితంలోని బిగ్‌బాస్ ఇంటికి రావడం కంటే అతి పెద్ద లక్ష్యం ఏది లేదు అంటూ ముందు నుంచి చెబుతుంది ఈమె.
ఇంటికి వచ్చిన తర్వాత తన గేమ్ ప్లాన్ కూడా అలాగే ఉంది. గెలవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది కాజల్. దాని కోసం సామ దాన వేద దండోపాయాలు అన్నీ ఉపయోగించుకుంటుంది. ఇక ఈమె గేమ్ ప్లాన్ చూసి అందరికీ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వడానికి ఒక రకంగా కాజల్ కూడా కారణమే. దానికి తోడు రెండు వారాల కిందట తన స్నేహితుడు సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇప్పించడానికి కాజల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దాని కోసం మిగిలిన ఇంటి సభ్యులందరితో తిట్లు తింది. తన ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటూ కాజల్ ఆ రోజు మామూలు రచ్చ చేయలేదు.
అయితే సన్నీ(Sunny) విషయంలో ఆమె ఎందుకు అంత మొండిపట్టు పట్టింది అనేది ఆ రోజు ఎవరికీ అర్థం కాలేదు. కానీ రవి ఎలిమినేషన్ ఎపిసోడ్ చూస్తే కాజల్ తెలివి తేటలు అందరికీ అర్థం అవుతాయి. సాధారణంగానే సన్నీ బాగా ఎమోషనల్. ఫ్రెండ్ కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. అందుకే పట్టుబట్టి మరీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సన్నీకి వచ్చేలా చేసింది కాజల్. దాని వెనుక ఆమె గేమ్ ప్లాన్ మరొకటి ఉంది. సన్నీ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వడని కాజల్ కు కూడా తెలుసు.
ఆయనకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇప్పిస్తే ఏదో ఒక వారం తన కోసం ఉపయోగపడుతుందని ముందుగానే ఆలోచించుకుని పెట్టుకుని కాజల్. ఆమె అనుకున్నట్టుగానే సన్నీ చివరికి అది కాజల్ కోసమే వాడాడు. ఇప్పుడు అది సన్నీకి ఉపయోగపడలేదు.. అలాగని కాజల్ కూడా ఉపయోగించుకోలేదు. చివరికి వృధా చేశారు. ఇదంతా కాజల్ గేమ్ ప్లానింగ్ అని తెలిసిన తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. వామ్మో మామూలు కన్నింగ్ కాదు అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇది కూడా చూడండి
Naatu Naatu song | నాటు నాటు స్పీడు మామూలుగా లేదు..75 మిలియన్ వ్యూస్..!
Akhanda Vs Lovestory | లవ్‌స్టోరీని అఖండ బీట్ చేస్తుందా..?
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

