బిగ్ బాస్ హౌస్ నుంచి కాంట్రవర్సీ క్వీన్ అవుట్..

RJ Kajal elimination from bigg boss 5 telugu | బిగ్‌బాస్ 5 తెలుగులో కాంట్రవర్సీ క్వీన్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా అందరూ చెప్పే పేరు ఆర్జే కాజల్. కేవలం ఇది ప్రేక్షకుల అభిప్రాయం కాదు.. ఇంటి సభ్యులు అభిప్రాయం కూడా. నూటికి 90 శాతం మందికి ఈ అమ్మాయి నచ్చదు అని గత వారం ఎలిమినేట్ అయిన ప్రియాంక సింగ్ ఓపెన్‌గా చెప్పింది. చిన్న విషయాలకు కూడా గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అంటూ ఇంటి సభ్యులు కూడా చాలాసార్లు చెప్పారు. మరో వైపు షణ్ముఖ్ జస్వంత్ అయితే నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయి అని రెండు మూడు సార్లు చెప్పాడు. అదే కారణంతో కాజల్‌ను నామినేట్ కూడా చేశాడు. అయితే తన ఆటిట్యూడ్‌తో 14 వారాల పాటు ఇంట్లో ఉంది కాజల్. టాప్ 6 కంటెస్టెంట్లో ఒకరిగా నిలిచింది. చాలా వారాలు డేంజర్ జోన్లో ఉన్నా కూడా ఇతర కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోవడంతో బతికిపోయింది. అయితే ఈ సారి ఆ ఛాన్స్ లేదు. కాజల్ బయటకు వచ్చేసింది.
నిజానికి పదో వారం ఆర్జే కాజల్ బయటికి వెళ్లాలి.. కానీ ఆ వారం జెస్సీ అనారోగ్యం కారణంగా బయటకు వచ్చేశాడు. దాంతో కాజల్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. 14వ వారం ఈమె ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఓటింగ్ పరంగా చూసుకుంటే మిగిలిన ఐదుగురు సభ్యులతో కాజల్ పోటీ పడలేకపోయింది. టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలవాలని కలలుగన్న ఈమె.. అది తీరకుండానే బయటకు వచ్చేసింది. ఈవారం కాజల్ ఎక్కువగా డబుల్ గేమ్ ఆడిందనే విమర్శలు బాగా వచ్చాయి. ముఖ్యంగా సన్నీ, మానస్ దగ్గర కేవలం ఓటింగ్ కోసమే ఫ్రెండ్షిప్ చేసినట్లు ఈమెపై సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. పైగా ముగ్గురు ఈసారి నామినేషన్లో ఉండటంతో.. కాజల్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయింది. మరి బయటికి వచ్చిన తర్వాత ఈమె తన కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha: సమంత మాస్ సాంగ్ ఆ సినిమా పాటకు కాపీనా?
Sunny: సన్నీ కోసం త్యాగం చేసిన సిరి.. అమ్మ కోరిక తీర్చకపోతే బాధపడతానన్న వీజే
Shanmukh: ఆడియన్స్‌ని జడ్జ్ చేయడం, ఫన్ చేయడం ఎందుకు చేస్తున్నారంటూ షణ్ముఖ్‌కి ప్రశ్న..
Kajal: కాజల్‌ని ఏడిపించడంపై మానస్, సన్నీకి క్లాస్…!
Manas: సన్నీ మిమ్మల్ని వాడుకుంటున్నాడా అని మానస్‌కి ప్రశ్న.. సమాధానం ఏంటి ?
Siri: షణ్ముఖ్ కన్నా మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ సిరికి కాంప్లిమెంట్స్
Siri: షణ్ముఖ్ కన్నా మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ సిరికి కాంప్లిమెంట్స్
Kajal: సినిమా స్టార్స్ పాత్రలలో లీనమైన హౌజ్ మేట్స్.. బెస్ట్ పర్ఫార్మర్గా కాజల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

