హౌజ్‌మేట్స్ ని ఆడియన్స్ ప్రశ్నలు అడిగే క్రమంలో ఆరో ప్రశ్నగా.. సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్‌గా ఫీల్ అవుతారు? మీరు సిరిని ప్రతిసారి ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు. తనని తనలా ఎందుకు ఉండనివ్వరు? అని షణ్ముఖ్‌ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆయన.. ఇది నేనూ ఊహించాను. నేను పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నానని నాకూ తెలుసు. కొన్ని కొన్ని విషయాల్లో ఆమెను కంట్రోల్ చేస్తే బెటర్ అని, మిగతా కొన్నింటిలో ఆమె ఆమెలా ఉంటే సరిపోతుందని అనుకున్నాను.
ఏది కంట్రోల్ చేస్తున్నానో, ఏది పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నానో నాకే తెలియడం లేదు. నన్ను నాకన్నా ఎక్కువ తనే అర్థం చేసుకుంటుంది. తనమీద ఎవరైనా గేమ్ ఆడాలనుకుంటే తప్పకుండా కంట్రోల్ చేస్తాను. ఎందుకంటే ఆమెను టాప్ 5లో చూడాలనుకుంటున్నాను అని షణ్ముఖ్ స్టార్ట్‌గా బదులిచ్చాడు. ఇక ఏడో ప్రశ్నగా.. అందరి ముందు కాజల్‌ని ఎందుకు కించపరుస్తారు? స్టాండ్ తీసుకొని మీకోసం ఎవిక్షన్ ప్రీ పాస్ తను విన్ అయ్యింది అని సన్నీ, మానస్‌లని ప్రశ్నించారు.
మేం ఫ్రెండ్స్. సరదాగానే మేం ఆమెని అలా అన్నాం. మీకలా అనిపించిందంటే ఇంకా ఎక్కువ చేస్తాము అంటూ పంచ్ వేశాడు సన్నీ. ఇక ఎనిమిదో ప్రశ్నగా.. రవిని నామినేట్ చేశారు, ఇన్ఫ్లూయెన్సర్ అనే పేరు కూడా పెట్టారు. మరి టికెట్ టు ఫినాలే టాస్క్‌లో మేం నీకోసం ఆడుతున్నాం రవి , మిస్ యూ రవి అని అనడం కరెక్ట్ అనుకుంటున్నారా? అని సిరి, షణ్ముఖ్‌లను ప్రశ్నించగా సిరి బదులు ఇచ్చింది.
మనిషి పక్కన ఉన్నప్పుడు అతడి వాల్యూ తెలియలేదు. నన్ను చెల్లెలిగా చూస్తూ ఏడిపిస్తాడు. రవి సడన్‌గా ఎలిమినేట్ అవడంతో షాక్‌లోకి వెళ్లిపోయా. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో రవి గుర్తొచ్చాడు, అతడి కోసం ఆడాలనిపించింది అని చెప్పుకొచ్చింది. షణ్ముఖ్ మాత్రం..సీరియస్‌గా మోజో రూం సోఫాలోకి వచ్చి.. అంటే ఆడియన్స్ ఫీలింగ్ ఏంటి?? నువ్వే నామినేట్ చేసి.. నువ్వే ఎలా అన్నావ్ అని అంటున్నారు.. అంత పెయిన్లో కూడా రవీ అని ఎలా అన్నావ్ అనేది వాళ్ల పాయింట్ అని సిరిని అడిగాడు షణ్ముఖ్.