ఆడియన్స్ హౌజ్‌మేట్స్‌కి ప్రశ్నలు సంధిస్తున్న క్రమంలో మూడో ప్రశ్నగా సన్నీని.. గిల్టీ బోర్డ్ వేసుకుని తిరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ ఇన్సిడెంట్ తరువాత మీ కాన్ఫిడెన్స్‌ని ఎలా తిరిగిపొందారు? అని ప్రశ్నించారు. దీనికి సన్నీ.. గిల్టీ బోర్డ్ అనేది ఈ సీజన్లో నన్ను బాగా బాధపెట్టింది. కెప్టెన్సీ టాస్క్‌లో హౌస్ మేట్స్‌కి నాపై కోపం కలిగింది. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. దాని తరువాత కాన్ఫిడెన్స్ పెరిగింది.. దాన్ని కంటిన్యూ చేస్తున్నా. బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నా అని చెప్పాడు.
ఇక నాలుగో ప్రశ్నగా శ్రీరామ్‌ని .. జెస్సీతో ఇష్యూ జరిగినప్పుడు షన్నూ ఇమ్ మెచ్యూర్డ్ అని అన్నారు.. కానీ ర్యాంకింగ్‌లో మీరే షన్నూ మెచ్యూర్డ్ అని తనకి రెండో స్థానం ఇచ్చారు.. మీ ఒపీనియన్ ఎందుకు మారింది? ఇప్పుడు మీరు షన్నూ గ్రూప్‌లో ఉన్నారా? అని ప్రశ్నించారు. దీనికి శ్రీరామ్.. నేను ఏ గ్రూప్‌లోనూ లేను. ఫస్ట్‌లో షన్నూతో నాకు పెద్ద పరిచయం లేదు. ఇప్పుడు నాకు తెలిసిన షణ్ముఖ్ వేరు.. తను ఏంటో తెలిసింది. అందుకే నా ఒపీనియన్ మార్చుకున్నా అని చెప్పాడు.
ఇక ఐదో ప్రశ్న మానస్‌ని అడిగారు. ఆడియన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా? అని అడగగా, దానికి మానస్.. ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడు అనేది రాంగ్.. మా బాండ్ పెరుగుతూనే ఉన్నది.. జన్యున్‌గా నేను కనెక్ట్ అయ్యా.. ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తాడు.. ఒకర్ని వాడుకుని పైకి ఎదగాలనే మనస్తత్వం సన్నీది కాదు.. నేను సన్నీతో ట్రావెల్ అవుతున్నా కాబట్టి వాడేంటో నాకు తెలుసు.. మీకు అనిపిస్తే మీరు మార్చుకోండి అని చెప్పాడు.తనకు నచ్చిన వారు ఎలిమినేట్ అయితే సన్నీ ఎంత బాధపడతాడో మాకు తెలుసు మానస్ అన్నాడు.