శుక్రవారం నాటి ఎపిసోడ్లో హౌస్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్ జర్నీపై వాళ్లు చేసిన తప్పులపై ఆడియన్స్ నుంచి దిమ్మతిరిగే ప్రశ్నలు వచ్చాయి. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ముక్కు సూటిగా సమాధానం ఇవ్వాలని కోరారు బిగ్ బాస్. ఇందులో భాగంగా మొదటి ప్రశ్న సిరికి ఎదురైంది. షణ్ముఖ్ కంటే స్ట్రాంగ్ ప్లేయర్.. కానీ మిమ్మల్ని మీరు ఎందుకు అలా కన్సిడర్ చేసుకోవడం లేదు, ఎందుకు అని ప్రశ్నించారు.
నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు.. నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని నమ్ముతాను. నేను హౌస్‌లో కొన్ని పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు నాకు షణ్ముఖ్ తోడుగా ఉన్నాడు.. నేను ఒక్కసారి నమ్మతే ఇచ్చేస్తాను.. నేను చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను.. వాడ్ని నేను అక్కడ చూడాలని అనుకుంటున్నా.. మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే సారీ అంటూ సిరి బదులిచ్చింది. ఇక రెండో ప్రశ్నగా అనీ మాస్టర్‌తో రెస్పెక్ట్ గురించి మాట్లాడినప్పుడు తుడిచిన టిష్యూని సన్నీపై కొట్టడం మర్యాదా అని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
దీనికి సమాధానం ఇచ్చిన కాజల్.. అనీ మాస్టర్‌తో జరిగింది గొడవలో.. సన్నీతో కూడా గొడవలోనే కానీ.. అది కూల్ డౌన్లో చేసే ప్రాసెస్‌లో అలా చేశా.. అతనికి నాకు ఆ చనువు ఉంది అందుకే వేశాను. సన్నీ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అంటూ స్మార్ట్‌గా సమాధానం ఇచ్చింది. రెండు ప్రశ్నలు పూర్తైన తరువాత ఇగో మాస్టర్ షణ్ముఖ్ ఇగో హర్ట్ అయిపోయింది.. ప్రేక్షకులు అంటున్నారు కదా.. షన్నూ కంటే సిరి స్ట్రాంగ్ అని అది కూడా ఒక పాయింటే కదా అని మోజ్ సోఫాపై సిరితో చర్చలు జరిపాడు.