శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తరాల టాస్క్‌లో హౌజ్‌మేట్స్‌కి ముసుగు లేకుండా సమాధానాలు చెప్పాలని బిగ్ బాస్ చెప్పడంతో అందరు కూడా స్ట్రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. కాజల్, మానస్లు షణ్ముఖ్ పేరే చెప్తే.. షణ్ముఖ్, శ్రీరామ్‌లు సిరి పేరు చెప్పారు. అయితే చివర్లో సన్నీ, సిరిలు మాట్లాడుకున్నారు.. సిరి సన్నీకోసం త్యాగం చేసి.. సర్లే నువ్ వెళ్లు అని అనడంతో సన్నీ.. ఆడియన్స్‌ని ఓట్లు అభ్యర్ధించాడు.
సన్నీ మాట్లాడుతూ.. ‘నేను అగ్రెసివ్ కాదు, టాస్కుల్లో 100 % ఇస్తున్నాను. నాకోసం కప్పు గెలుచుకురారా అని అమ్మ నన్ను ఒక కోరిక కోరింది. అది నెరవేర్చలేకపోతే బాధపడతాను. నాకీ అవకాశమిచ్చిన సిరికి సపోర్ట్ చేయండి. ప్లీజ్ వోట్ ఫర్ మీ..’ అని కోరాడు. అనంతరం హౌజ్‌మేట్స్ అందరు రిలాక్స్డ్ మూడ్‌లోకి వెళ్లారు.
ఇక ఈ రోజు శనివారం కావడంతో నాగార్జున బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌తో ఫుల్ ఫన్ చేయడంతో పాటు క్లాసులు కూడా తీసుకోనున్నారని తెలుస్తుంది. ఈ వారం శ్రీరామ్ డైరెక్ట్‌గా ఫినాలేకు వెళ్లిపోవడంతో ఉన్న ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. సన్నీ, కాజల్‌లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.