బిగ్ బాస్ చివరి రోజులలో హౌజ్‌మేట్స్ తమ పర్ఫార్మెన్స్లతో రచ్చ చేస్తున్నారు. రీసెంట్గా జరిగిన టాస్క్‌లో సూర్యగా షణ్ను, జెనీలియాగా సిరి, పవన్ కల్యాణ్‌గా మానస్, చిరంజీవిగా శ్రీరామ్, బాలయ్యగా సన్నీ, శ్రీదేవిగా కాజల్ అదరగొట్టారు. కాజల్ పర్ఫార్మెన్స్ అందరికి నచ్చడంతో హౌస్మేట్స్ ఆమెను బెస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. ఉన్నంతలో పవన్ కళ్యాణ్‌లా మానస్.. బాలయ్యలా సన్నీ.. చిరంజీవిలా శ్రీరామ్ పర్వాలేదు అనిపించారు.
అందరి ఏకాభిప్రాయంతో ఎంపికైన కాజల్.. ‘ఓట్ ఫర్ మి’ ద్వారా ప్రేక్షకుల్ని ఓట్లు వేయమని రిక్వెస్ట్ చేసింది. ‘డే 1 నుంచి నేను ఎలా ఉన్నానో చూస్తున్నారు.. బిగ్ బాస్‌కి రావడం అనేది నా డ్రీమ్.. నా డ్రీమ్ నెరవేరింది.. టాప్ 5కి ఒక్క అడుగుదూరంలో ఉన్నాను.. నా ఫ్రెండ్స్ సన్నీ, మానస్‌లకు కూడా ఓటు వేయండి.. వాళ్లతో పాటు టాప్ 5లో ఉంటే.. నా కల నెరవేరినట్టే.. దయచేసి మాకు ఓటు వేసి సపోర్ట్ చేయండి’ అని ప్రేక్షకుల్ని ఓట్లు అభ్యర్ధించింది కాజల్.
ఈ టాస్క్ పూర్తైన తర్వాత బిగ్ బాస్ ప్రేక్షకులకి మరో టాస్ ఇచ్చారు. మీపై ప్రేమ కురిపించే అభిమానులలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటిని మీతో నేరుగా పంచుకునే సమయం ఆసన్నమైంది. ప్రశ్నలు స్క్రీన్‌పై ప్రత్యక్షం అవగానే అది ఎవర్నైతే అడిగారో వారు దానికి బదులివ్వాల్సి ఉంటుంది. ఎలాంటి ముసుగు వేసుకోకుండా సమాధానాలు చెప్పినవారు ఓట్ ఫర్ అప్పీల్‌కు అవకాశం పొందుతారు అని చెప్పారు బిగ్ బాస్. దీంతో అందరు హౌజ్‌మేట్స్ ముసుగు లేకుండా సమాధానాలు చెప్పారు.