బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ఆడియన్స్ హౌజ్‌మేట్స్ కి పలు ప్రశ్నలు వేశారు. ఇందులో తొమ్మిదో ప్రశ్నగా ఇవి ఎలా నచ్చుతున్నాయి.. అవి ఎలా నచ్చుతున్నాయి అని ఆడియన్స్‌ని జడ్జ్ ఎందుకు చేస్తున్నారు? వారిపై ఫన్ ఎందుకు చేస్తున్నారు? అని షణ్ముఖ్‌ని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా ఆయన .. ఆడియన్స్ ని జడ్జ్ చేయడం లేదు.. నా పాయింట్ నేను చెప్తున్నా.. అది బయటవాళ్లకి నచ్చుతుందా లేదా? అని ఆలోచిస్తున్నా… అది తప్పా కరెక్టో అర్ధం కావడం లేదు. నేను ఆడియన్స్‌ని ఫన్ చేయడం లేదు.. మళీ అది రిపీట్ చేయను అని అన్నాడు.
ఇక పదో ప్రశ్నగా ..మీరు బిగినింగ్ నుంచి గ్రూప్‌లోనే ఆడుతూ వచ్చారు. కానీ మిమ్మల్ని మీరు.. లోన్ రేంజర్లా చూపించుకుంటున్నారు. ఇది సింపథీ గేమ్ ప్లాన్ కాదా? ఎవిక్షన్ ప్రీ పాస్‌లో మీరు, రవి.. ఇద్దరి ఫొటోలను కాల్చేయాలని ప్లాన్ వేశారు.. కానీ కాజల్ అదే పని చేస్తే.. మీకు ఎందుకు కోపం వచ్చింది? అని అడిగారు. దీనికి నేను సింపథీ కోసం ఆడట్లేదు.. అలాంటివి నాకు తెలియదు.. కలిసి ఆడదాం అనే ఉంటుంది.. ఫైర్ స్టేషన్ గేమ్‌లో నేను ఓవర్‌గా రియాక్ట్ అయ్యానని నాకూ అనిపించింది.. తరువాత కాజల్‌తో చెప్పా అని శ్రీరామ్ అన్నాడు.
పదకొండో ప్రశ్నగా.. మానస్‌కి.. మీరు, ప్రియాంకని మీ ఫ్రెండ్ అనుకున్నప్పుడు తనని బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు చేశారు? అందుకు సమాధానం ఇచ్చిన మానస్.. కొన్నిసార్లు ప్రియాంక ప్రవర్తన నచ్చనప్పడు అది వేరే వాళ్లతో షేర్ చేసుకున్నా.. ప్రియాంక మంచి కోరుకున్నా కాబట్టే.. ఆమెను కిందకి లాగాలని అనుకోలేదు. ఆమెకు సారీ చెప్తున్నా.. మీరు హర్ట్ అయితే సారీ అని అన్నాడు మానస్.