Suriya 45 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య (Suriya) నటించిన కంగువ అభిమానులను నిరాశ పరిచిన విషయం తెలిసిందే. అయితే నిరాశలో ఉన్న తన ఫాలోవర్లు, ఫ్యాన్స్‌కు కావాల్సిన వినోదాన్ని అందించేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు.ఈ స్టార్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి సూర్య 45 (Suriya 45). ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఆర్జే బాలాజీ కూడా కనిపించబోతున్నాడట.
తాజా వార్తల ప్రకారం ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ సూర్య 45లో నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడట. అయితే మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే సూర్య నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ రాబడతాడని అభిమానులు మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఆర్జే బాలాజీ (RJ Balaji) టీం నుంచి కొన్ని రోజుల క్రితం కోయంబత్తూరు అగ్రికల్చర్ కాలేజీలో షూటింగ్ సెట్ వర్క్ పనులకు సంబంధించిన విజువల్స్, స్టిల్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో చెన్నై సుందరి త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇక స్క్రిప్ట్‌లోని కోర్ పాయింట్‌పై ప్రభావం పడకుండా సూర్య సార్ కోసం సూర్య 45లో చాలా మార్పులు చేశామని.. సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశామని సూర్య 45 ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడని తెలిసిందే.
Madha Gaja Raja | 12 ఏండ్లకు థియేటర్లలోకి.. విశాల్ మదగజరాజ రిలీజ్ టైం ఫిక్స్
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్