Taapsee | గత మూడేళ్లుగా తెలుగు సినిమాలకు బ్రేక్‌నిచ్చింది పంజాబీ సుందరి తాప్సీ. అయితే హిందీలో మాత్రం ఈ భామ ప్రయోగాత్మక కథాంశాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నది. ఆమె తాజా హిందీ చిత్రం ‘గాంధారి’కి సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం వెలువడింది.
బాలీవుడ్ నాయిక కనికా థిల్లాన్ రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో తాను పూర్తి యాక్షన్ అవతారంలో కనిపిస్తానని, తన కూతురిని రక్షించుకోవడానికి ఒక తల్లి ఎంత దూరం వెళ్లింది, ఎలాంటి సాహసాలు చేసిందనే అంశాలు భావోద్వేగభరితంగా సాగుతాయని తాప్సీ తెలిపింది.
‘దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత యాక్షన్ సీక్వెన్స్‌లో నటించబోతున్నా. ‘గాంధారి’ అద్భుతమైన స్క్రిప్ట్. ఓ తల్లి మానసిక వేదనకు, పోరాటానికి దృశ్యరూపంగా ఉంటుంది. ఇలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్ కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నా’ అని తాప్సీ పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదలకానుంది. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్లో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.