Renu Desai | సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొద్ది రోజులకి విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని జంటలు విడిపోతే మాత్రం అభిమానులు చాలా బాధపడిపోయారు. వారిలో పవన్ కళ్యాణ్- రేణూ దేశాయ్ జంట తప్పక ఉంటుంది. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్నాళ్లకే విడిపోవడం అభిమానులకి ఏ మాత్రం రుచించలేదు. దాదాపు 13 ఏళ్ల క్రితం పవన్ -రేణూ దేశాయ్ విడిపోయిన వారికి పుట్టిన పిల్లలని పవన్ కళ్యాణ్ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. రేణూ నుండి విడిపోయాక పవన్ మరో పెళ్లి చేసుకున్నాడు కాని, ఆమె మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటుంది.
బద్రి సినిమా సమయంలో పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్‌ల మధ్య ప్రేమ పుట్టింది. కొంత కాలం వారిద్దరు సహజీవనం చేశారు. ఆ సమయంలోనే అకీరా నందన్ జన్మించారు. అంటే 2004 లో అకీరా జన్మించగా, 2009లో పవన్, రేణుల వివాహం జరిగింది. అప్పటికీ అకీరా ఏజ్ ఐదేళ్లు.ఇక పెళ్లైన తర్వాతి సంవత్సరానికి ఆద్య జన్మించింది. ఆద్య జన్మించిన రెండేళ్లకి పవన్ -రేణూ దేశాయ్‌లు విడిపోయారు. అయితే తన కొడుకు ముందు పెళ్లి చేసుకోవడం మీకు ఎలా అనిపించింది అని రేణూని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, దానికి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. కొడుకు సాక్షిగా పెళ్లి జరగడం నాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందని తెలియజేసింది.
కొందరు దీన్ని నెగటివ్‌గా చూశారు, బ్యాడ్‌గా కూడా మాట్లాడుకున్నారు. కానీ నాకు మాత్రం అదొక మంచి అనుభూతిగా ఇచ్చిందని, `నా పెళ్లిని నా కొడుకు దగ్గరుండి జరిపించడం ఎంత గొప్ప విషయం. ఇది ఎందరికి దక్కుతుంది. నా కొడుకు ముందు నా పెళ్లి జరగడం అనే కాన్సెప్ట్ మాత్రం నాకు బాగా నచ్చుతుంది అని రేణూ తెలియజేసింది. ఇది 16 ఏళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో రేణూ ఈ కామెంట్స్ చేయగా, ప్రస్తుతం ఇది నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇక తన పెళ్లి అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో అచ్చతెలుగు సాంప్రదాయం ప్రకారం జరిగినట్టు పేర్కొంది రేణూ.