“భ్రమరాంభ థియేటర్లో నేను సినిమా చూశాను. 90శాతం యూత్ ఆడియెన్స్ కనిపించారు. వాళ్లంతా కథలో ఇన్వాల్వ్ అయి సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా వస్తున్నారని అమెరికా నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా మేము టార్గెట్‌గా పెట్టుకున్న కుటుంబ ప్రేక్షకులకు చేరువైంది’ అన్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో ఆయన తెరకెక్కించిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ ‘ఈ సినిమాలోని ఎమోషన్స్‌తో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు.
తమ కుటుంబాలను గొప్ప స్థానంలో నిలబెట్టిన రియల్ ఫ్యామిలీ స్టార్స్ కొందరిని మా టీమ్ త్వరలో కలవబోతున్నది. ఇప్పటికే మూడు కుటుంబాలను ఎంపిక చేశాం’ అన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను నమ్మి ఈ కథ రాశానని, ఇదొక ఆణిముత్యంలాంటి సినిమా అని, కుటుంబం కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నానని దర్శకుడు పరశురామ్ తెలిపారు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూశానని, అందరూ చప్పట్లు కొడుతూ, నవ్వుతూ, ఎమోషనల్‌గా ఫీలవుతూ సినిమాను ఆస్వాదిస్తున్నారని కథానాయిక మృణాల్ ఠాకూర్ చెప్పింది.