Ram Charan 16 Movie | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆర్సీ16. ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. మైసూర్లో రామ్ చరణ్‌పై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు మేకర్స్.
ఇదిలావుంటే ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు మారినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దర్శక దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చిత్రబృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలు ఫేక్ అంటూ వెల్లడించింది. ఇలాంటి రూమర్స్‌ను షేర్ చేయొద్దని.. అలాగే వీటిని నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఈ సినిమా తదుపరి షెడ్యూల్ 27 నుంచి ప్రారంభం కానుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో మున్నాభాయ్యగా నటించిన దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ఇండియా ప్రాజెక్ట్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా..జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తుంది.