Ram Charan 16 Movie | గేమ్ ఛేంజర్ వంటి డిజాస్టార్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఆర్సీ16. ఈ సినిమాకు ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో మున్నాభాయ్యగా నటించిన దివ్యేందు శర్మ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తుంది.
రేపు రామ్ చరణ్ బర్త్‌డే కానుకగా… ఆర్సీ16 నుంచి రామ్ చరణ్ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేయబోతుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా వెల్లడించారు. రేపు ఉదయం 9.09 గంటలకు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ఇండియా ప్రాజెక్ట్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
Title and First Look out Tomorrow #RC16 🔥💥 pic.twitter.com/669UUKBpRq
— BuchiBabuSana (@BuchiBabuSana) March 26, 2025