Raviteja 76 Movie | మాస్ హీరో రవితేజ ఒకవైపు మాస్ జాతర సినిమాను విడుదలకు సిద్ధం చేస్తునే మరోవైపు తన కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. రవితేజ 76వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా షూటింగ్ నేడు మొదలైంది. రవితేజతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా పూర్తిస్థాయి కుటుంబ వినోదాత్మక చిత్రంగా ఉంటుందని, రవితేజ తన మార్క్ కామెడీ టైమింగ్, మాస్ అప్పీల్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమా కోసం రవితేజ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏ. ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం రవితేజ “మాస్ జాతర” అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు, ఇది ఆగస్టు 27న విడుదల కానుంది.
#RT76 hits the floors with talkie part being shot ❤🔥
Mass Maharaaj @RaviTeja_offl in his elements – like we all love to see him 🤩
A solid entertainer loading.
Title & First Look out soon.
In Cinemas Sankranthi 2026 ❤🔥
MASS MAHARAAJ @RaviTeja_offl @DirKishoreOffl… pic.twitter.com/0PYDZauxO0
— SLV Cinemas (@SLVCinemasOffl) June 17, 2025
Read More