Ravi Teja | రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలకానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అలస్యం కానుందని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై స్పష్టతనిస్తూ చిత్రబృందం ఓ ప్రకటన చేసింది.
‘ఈ సినిమా విషయంలో ఎలాంటి వదంతులను నమ్మొద్దు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన తేదీకే ఈ సినిమా మీ ముందుకొస్తుంది’ అని నిర్మాత తెలిపారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.మది, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, రచన-దర్శకత్వం: వంశీ.