Tiger Nageswara Rao | మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) నటించిన టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) ఓటీటీలోకి వచ్చేసింది. అక్టోబర్ 19న దసరా కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ అందుకున్నది. ఎక్కువ నిడివితో మొదట్లో డివైడ్ టాక్ రావడంతో 20 నిమిషాలపాటు లెంగ్త్ తగ్గించారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం మారినప్పటికీ ఓ మోస్తారు కలెక్షన్లతో సరిపెట్టుకోవాల్సివ చ్చింది. పాన్ఇండియా రేంజ్లో విడుదలైనప్పటికీ హిందీతోపాటు దక్షిణాది భాషల్లోనూ అంతగా ప్రభావం చూపలేకపోయింది.
నుపూర్సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రేణుదేశాయ్, అనుపమ్ ఖేర్ ప్రధానపాత్రలు పోషించారు. భారీ బడ్జెత్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతున్నది. ఎలాంటి ప్రకటనా లేకుండానే శుక్రవారం తెల్లవారుజామున విడుదల చేశారు. తొలుత ఈ నెల 27న ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నది.