Tiger Nageswara Rao | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) కాంపౌండ్ నుంచి రాబోతున్న తొలి పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన లుక్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ లుక్‌లో ట్రాక్‌పై కనిపించిన రవితేజ.. ఫస్ట్ లుక్‌లో ఈ సారి ఏకంగా రైలుపై ఉండటం చూడొచ్చు.
అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు వేట షురూ కాబోతుందంటూ లాంఛ్ చేసిన లుక్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. మొత్తానికి టైగర్ నాగేశ్వర రావు ఎవరిని వేటాడబోతున్నాడనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనంటున్నారు మేకర్స్. వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్న టైగర్ నాగేశ్వర రావులో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తోంది. నుపుర్ సనన్ ఈ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది. రేణూదేశాయ్ హేమలత లవణం పాత్రలో నటిస్తోంది.
ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
#TigerNageswaraRao @RaviTeja_offl is ready to poach the Box Office 🐅
HUNTING WORLDWIDE from OCTOBER 20th 2023 🔥🔥@DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla @SrikanthVissa @MayankOfficl pic.twitter.com/IG4hLwYC5D
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) March 29, 2023
రైల్వే ట్రాక్‌పై టైగర్ నాగేశ్వర్ రావు..
Ready to strike 🐅#TigerNageswaraRao first look announcement today at 6.03 PM.@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl #RenuDesai @AnupamPKher @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla @SrikanthVissa @MayankOfficl pic.twitter.com/HDmE3GkYM5
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) May 15, 2023