Super El Niño | సూపర్ ఎల్ నినోతో 4.5 లక్షల మరణాలు..! ఉష్ణోగ్రతల వల్ల భారత్లో 15,800 చావులు!
సూపర్ ఎల్ నినో వల్ల రానున్న ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 4,51,000 మరణాలు సంభవించనున్నాయని.. అందులో ఉష్ణోగ్రత సంబంధిత కారణాల వల్ల భారత్లో 15,800 చావులు సంభవిస్తాయని బుధవారం విడుదలైన యూనివర్సిటీ ఆఫ్ షికాగో అధ్యయనం తెలిపింది.
- ఉష్ణోగ్రతల వల్ల భారత్లో 15,800 చావులు!
- ప్రభుత్వాలు ఎమర్జెన్సీ సేవలు చేపట్టాలి
- యూనివర్సిటీ ఆఫ్ షికాగో అధ్యయనం హెచ్చరిక
షికాగో : సూపర్ ఎల్ నినో వల్ల రానున్న ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 4,51,000 మరణాలు సంభవించనున్నాయని.. అందులో ఉష్ణోగ్రత సంబంధిత కారణాల వల్ల భారత్లో 15,800 చావులు సంభవిస్తాయని బుధవారం విడుదలైన యూనివర్సిటీ ఆఫ్ షికాగో అధ్యయనం తెలిపింది. ‘ఇండియాలో సంభవించే మరణాల్లో సుమారు సగం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో సంభవించవచ్చు. మరణాలు అక్కడితో ఆగవు.
ఎండా కాలంలో ఈ సంఖ్య మరింత పెరగవచ్చు’ అని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో అత్యవసర స్పందన సేవలు, స్థిరమైన ప్రయత్నాలను ప్రభుత్వాలు చేపట్టాలని నివేదిక సూచించింది. ఉష్ణోగ్రత హెచ్చరిక జారీ, బడుగు వర్గాలకు ఆరోగ్య సేవలు, శీతలీకరణ కేంద్రాలు, హైడ్రేషన్ స్టేషన్ల ఏర్పాటు, కార్మికుల భద్రత, ఆరోగ్య వ్యవస్థ సామర్థ్య విస్తరణ చేపట్టాలని కోరింది. ఎల్ నినో వల్ల రానున్న నెలల్లో ప్రపంచ భూ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 1.2 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువ ఉండొచ్చని వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

