‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులకు నవ్వుల్ని పంచుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు రవితేజ. ఆయన కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటించారు. శనివారం బ్లాక్‌బస్టర్ మీట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రవితేజ పైవిధంగా స్పందించారు.
ఈ సంక్రాంతికి నాన్‌స్టాప్ వినోదంతో ఈ సినిమా ఆకట్టుకుంటున్నదని తెలిపారు. థియేటర్ విజిట్‌కి వెళ్లినప్పుడు ప్రేక్షకులు ప్రతీ సన్నివేశాన్ని మనసారా నవ్వుతూ ఆస్వాదిస్తున్నారని దర్శకుడు కిషోర్ తిరుమల పేర్కొన్నారు. సంక్రాంతికి బ్లాస్‌బస్టర్ హిట్‌ని అందించిన ప్రేక్షకులకు చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.