Ravi Teja | అగ్ర నటుడు రవితేజ కుడి చేతికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పటల్లో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన్ని ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వివరాల్లోకెళ్తే.. ‘ఆర్టీ 75’(వర్కింగ్ టైటిల్) సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ప్రమాదవశత్తూ రవితేజ కుడి చేతికి స్వల్ప గాయమైంది. గాయం చిన్నదే అయినా.. దాన్ని లెక్క చేయకుండా అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడం వల్ల అది తీవ్రమైందని వైద్యులు పేర్కొన్నారు.
దీంతో శస్త్రచికిత్స చేయడం తప్పలేదని వారు అన్నారు. రవితేజ గాయపడిన విషయం తెలుసుకున్న అభిమానులు షాక్‌కి గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక ‘ఆర్టీ 75’ సినిమా వివరాల్లోకెళ్తే.. రచయిత భాను భోగవరపు దర్శకుడిగా మారి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈసినిమాను తీర్చిదిద్దుతున్నారు. శ్రీలీల ఇందులో కథానాయిక.