రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. హీరో రవితేజ స్వతహాగా బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు వీరాభిమాని. చాలా సినిమాల్లో సందర్భానుసారంగా ఆయన్ని అనుకరిస్తూ కనిపించారు. ఇప్పుడు ఆయన పేరును స్ఫురించే టైటిల్‌తో రవితేజ సినిమా చేయడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా కేరళలోని కారంపూడిలో చిత్రీకరణ జరుపుకుంటున్నది.
రవితేజతో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. శుక్రవారం వింటేజ్ లుక్‌లో రవితేజ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన బ్యాగీ ప్యాంట్లో కనిపిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, రవితేజ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్, సంగీతం: మిక్కీ జే మేయర్, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్.