గత కొన్నేళ్లుగా యాక్షన్, మాస్ సినిమాలు చేస్తున్న హీరో రవితేజ తాజాగా ఓ ఫ్యామిలీ కథలో నటిస్తున్న విషయం తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఆర్టీ76 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సోమవారం సెట్స్‌పైకి వెళ్లింది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో రవితేజతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
రవితేజ శైలి కామెడీ, మాస్ అప్పీల్ కలబోసిన చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని, ఈ సినిమా కోసం ఆయన సరికొత్త మేకోవర్‌తో సిద్ధమయ్యారని చిత్రబృందం పేర్కొంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థ: ఎల్ఎల్వీ సినిమాస్, రచన-దర్శకత్వం: కిషోర్ తిరుమల.