రిలీజ్‌కు రెడీగా ఓ సినిమా.. నిర్మాణంలో ఓ సినిమా.. ఈ పంథాలో ముందుకు పోతూవుంటారు అగ్ర హీరో రవితేజ. ఆయన నటించిన ‘మాస్ జాతర’ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. అలాగే, కిశోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే తలంపుతో శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. ఇందులో కేతిక శర్మ, అషికా రంగనాథ్ కథానాయికలు.
ఎన్.ఎల్.వి.సినిమాస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సరదా టైటిల్‌ని ఫిక్స్ చేశారట. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసే అవకాశం ఉంది. గ్లింప్స్ కూడా రెడీ చేశారు. ‘మాస్ జాతర’ విడుదలవ్వగానే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.