Ravi Teja | రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ ఉపశీర్షిక. భాను భోగవరపు దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఆదివారం హీరో రవితేజ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్‌ను విడుదల చేశారు. యాక్షన్ ఘట్టాలతో గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. ‘మనదే ఇదంతా..’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం, రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్తో గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో విడుదల చేయబోతున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విధు అయ్యన్న, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, దర్శకత్వం: భాను భోగవరపు.