టాలీవుడ్ నుంచి మరో హీరో బాలీవుడ్‌కు వెళ్తున్నారు. మాస్ హీరో రవితేజ హిందీలో నేరుగా సినిమా చేయబోతున్నాడని సమాచారం. రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’, ‘కిక్’ వంటి సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. ఆయన ప్రతి తెలుగు సినిమా హిందీ డబ్‌తో ఉత్తరాది టీవీల్లో ప్రదర్శితమవుతుంటుంది. ఇలా రవితేజ అక్కడి ప్రేక్షకులకు పరిచితమే. రవితేజ బాలీవుడ్ డెబ్యూ మూవీ మల్టీస్టారర్‌గా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో వరుణ ధావన్ మరో హీరోగా నటిస్తారని తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానాతో కలిసి దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తారట. ఈ చిత్రాన్ని రూపొందించే బాధ్యతలు టాలీవుడ్ దర్శకుడే తీసుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే తెలుగు నుంచి రామ్‌చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ స్ట్రైట్ బాలీవుడ్ చిత్రాలను ప్రకటించారు. వీరి వరుసలో చేరబోతున్నారు రవితేజ.