అటు సీనియర్ హీరోలకూ, ఇటు కుర్రహీరోలకూ మధ్య వారధి లాంటివారు రవితేజ. ఈ రెండు జనరేషన్లతో పోటీ పడుతూ దూసుకుపోతున్నారాయన. రవితేజ నటించి ‘ఈగల్’ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆయన మలినేని గోపీచంద్ సినిమా చేయబోతున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ పాత్ర అత్యంత శక్తిమంతంగా ఉంటుందట. రవితేజ, గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన ‘క్రాక్’ సినిమాను మించే స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.
‘క్రాక్’ తరహాలోనే ఇందులోనూ విలన్ పాత్ర హీరోను ఢీకొనేలా ఉంటుదట. వాస్తవికతకు అద్దం పట్టేలా ఇందులోని కథ, కథనాలు సాగుతాయని వినికిడి. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.