Ravi Teja | హీరో రవితేజ లైనప్‌లో ప్రస్తుతం పలు భారీ చిత్రాలున్నాయి. ఈ వరుసలో మరికొన్ని సినిమాలు వచ్చి చేరుతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించబోతున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.
వీరిద్దరి కలయికలో గతంలో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి హిట్ చిత్రాలొచ్చాయి. దీంతో తాజా సినిమా అందరిలో ఆసక్తిని పెంచుతున్నది. ‘మాసియెస్ట్ కాంబో ఈజ్ బ్యాక్’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఆదివారం విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించబోతున్నారు.