టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja),త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం ధమాకా (Dhamaka). పెళ్లి సందD ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ను మేకర్స్ ప్రకటించనున్నారు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఆసక్తికర అప్డేట్ను రేపు ఉదయం 10.01 గంటలకు ప్రకటించనున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు మేకర్స్.
ఇంతకీ మేకర్స్ సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తారా..? లేదంటే వేరే అప్డేట్ ఏదైనా ఉందా..? అని తెగ ఆలోచిస్తున్నారు సినీ జనాలు. చిరాగ్ జానీ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. ధమాకా చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్. రవితేజ ఈ ప్రాజెక్ట్‌తోపాటు మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాల్లో సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న రావణాసుర, పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర్రావు ఉన్నాయి. వీటితోపాటు మెగా 154లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఏడాది శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
Read also : Saikumar | డైలాగ్ కింగ్ సాయికుమార్ 50 ఏండ్ల నట ప్రస్థానం.. ట్రెండింగ్‌లో స్టిల్
Read also : Venkat Prabhu | డైరెక్టర్ వెంకట్ ప్రభు-శివకార్తీకేయన్ కొత్త సినిమా అప్డేట్.. వీడియో