హీరో రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఇదిలావుండగా శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నది. ప్రియా భవానీ శంకర్ కథానాయిక. ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే కథాంశమిదని, కూతురి రక్షణ కోసం ఎంతదూరమైనా వెళ్లే తండ్రిగా రవితేజ పాత్ర భావోద్వేగభరితంగా సాగుతుందని చెబుతున్నారు. థ్రిల్లర్ అండ్ డివోషనల్ ఎలిమెంట్స్ కలబోతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్పై వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.