టాలీవుడ్లో ఓ క్రేజీ మల్టీస్టారర్‌కి తెరలేచింది. అగ్రహీరో రవితేజ, శ్రీవిష్ణు కలిసి ఓ చిత్రంలో నటించనున్నారు. శ్రీవిష్ణుతో రాజరాజ చోర, స్వాగ్ చిత్రాలను తెరకెక్కించిన హసిత్ గోలీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే హసిత్ వినిపించిన కథ రవితేజకు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయిందని సమాచారం. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వినికిడి.
త్వరలోనే లాంఛనంగా షూటింగ్ మొదలుకానున్నట్టు సమాచారం. ఈ క్రేజీ మూవీని 2027 సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. హసిత్ గోలి మార్క్ కామెడీ, రవితేజ ఎనర్జీ, శ్రీవిష్ణు టైమింగ్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నది.