Rashmika | సాధారణంగా సెలబ్రిటీలు ఫిట్నెస్ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ తమ అందం, యంగ్ లుక్ కోసం కఠినమైన డైట్లు, వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే యంగ్ హీరోయిన్ రష్మిక మందన్నా కూడా తన ఫిట్నెస్ మిషన్‌లో భాగంగా విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. తాజాగా జిమ్‌లో త్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తూ ఉన్న రష్మిక ఎదుట నోరూరించే డెసర్ట్ ఉంచారు. అయితే ప్రస్తుతం ఆమె కఠినమైన డైట్లో ఉండటంతో, ఆ ఇష్టమైన స్వీట్ తినలేని పరిస్థితి వచ్చింది. ఒకవైపు వ్యాయామం, మరోవైపు ఎదుట ఇష్టమైన డెసర్ట్ ఉండటంతో రష్మిక ముఖంలో కోపం, అసహనం, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్లు అందరు నవ్వేలా చేస్తున్నాయి.
ఆ వీడియోను రష్మిక స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయగా, నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
“పాపం రష్మిక… అన్నీ ఉన్నా తినలేని పరిస్థితి”, “ఫిట్‌గా ఉండాలంటే ఇలాంటి వాటి విషయంలో వెనక్కు తగ్గాల్సిందే”, “డెసర్ట్ కంటే రష్మిక ఎక్స్ప్రెషన్నే మధురం!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినీ కెరీర్ ప్రారంభం నుంచే రష్మిక తన ఫిట్‌నెస్‌పై ఎంత శ్రద్ధ చూపుతుందో తెలిసిందే. క్రమం తప్పకుండా వర్కౌట్స్, డైట్ ఫాలో అవుతూ, స్క్రీన్‌పై ఎనర్జీగా కనిపించే ఈ భామ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ఫిట్నెస్ ప్రేరణగా నిలిచింది. కన్నడ బ్యూటీగా సినీ రంగంలోకి వచ్చిన రష్మిక, ఛలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత గీతా గోవిందం , పుష్ప , పుష్ప 2 , యానిమల్, ఛావా , కుబేర వంటి సినిమాలతో తన స్థాయిని పెంచుకుంది. ప్రస్తుతం ఆమె * థామా, కాంచన 4 , రెయిన్బో , ది గర్ల్‌ఫ్రెండ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా, అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తోందని సమాచారం. ఇక విజయ్ దేవరకొండతో ఇటీవల ఎంగేజ్మెంట్ జరుపుకుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఎవరు స్పందించలేదు. ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. అయితే ఇటీవల చేతికి రింగ్ కనిపించడంతో అది ఎంగేజ్మెంట్ రింగ్ అని భావించిన ఫ్యాన్స్ త్వరలో వారిద్దరు పెళ్లి పీటలెక్కడం ఖాయం అంటున్నారు. ఏదేమైన రష్మిక షేర్ చేసిన ఈ ఫన్నీ జిమ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అభిమానుల్లో చర్చనీయాంశమైంది.