Rashmika- Vijay: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా ‘కింగ్డమ్’. ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్ లుక్లో కనిపించగా, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి స్టైల్ మార్క్ దర్శకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమా విడుదలైన మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకొని విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న చిత్రంగా నిలిచింది. విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్ హీరోగా ఇచ్చిన పర్ఫార్మెన్స్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సత్యదేవ్ – విజయ్ మధ్య వచ్చే సీన్లు గూస్ బంప్స్ తెప్పించడమే కాకుండా, సినిమాకు ఇంటెన్సిటీని పెంచేశాయి.
ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే… అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ పూర్తిగా మరో స్థాయిలో ఉంది. పాటలు మాత్రమే కాకుండా బీజీఎమ్ కూడా కథకు మంచి ఫీల్ తీసుకొచ్చింది. చిత్రం చూసిన ప్రతి ఒక్కరు మూవీపై మంచి ప్రశంసలు కురిపించారు. విజయ్ నటనని ఆకాశానికి ఎత్తారు. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండకు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బెస్ట్ విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత కూడా ఆమె ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.మనం హిట్టు కొట్టినం అంటూ తన ఆనందాన్ని పంచుకుంది.
అయితే రష్మిక అభిమానులతో కలిసి ఈ సినిమా చూడాలని ప్లాన్ చేసిందట. మొదట హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్ను ఎంచుకుందట కానీ, భద్రతా కారణాలతో ఆమెను అక్కడ అనుమతించలేదు. దీంతో ఆమె చివరకు భ్రమరాంబ థియేటర్లో మారువేషంలో ప్రేక్షకుల మధ్యే ‘కింగ్డమ్’ సినిమాను చూసిందట.ఈ విషయం తాజాగా నిర్మాత నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇప్పుడు ఈ విషయం వైరల్గా మారింది. విజయ్ -రష్మిక అభిమానులు ఈ విషయం తెలుసుకొని నోరెళ్లపెడుతున్నారు.గత కొద్ది రోజులుగా విజయ్- రష్మిక మధ్య ఏదో రిలేషన్ ఉందనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలాంటి వార్తలు అభిమానులకి కొత్త కొత్త అనుమానాలు కలిగిస్తున్నాయి. రానున్న రోజులలో ఈ జంట ఎలాంటి షాకులు ఇస్తారో చూడాలి.