ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఈ బ్యూటీ గుడ్‌బై సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. ఆశించిన స్థాయిలో బ్రేక్ అందుకోలేకపోయింది. మరోవైపు సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను సినిమాలో నటిస్తోండగా.. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది రష్మిక.
కాగా ఇపుడు రష్మికకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బీటౌన్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. బుధవారం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ (Sanjay Leela Bhansali) ఆఫీస్ దగ్గర ప్రత్యక్షమైంది రష్మిక. అయితే మీడియాతో ఏం మాట్లాడకుండానే ఆఫీస్ నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో రష్మిక త్వరలోనే బన్సాలీ డైరెక్షన్లో సినిమా చేస్తుందని అంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు.
ఈ క్రేజీ అప్డేట్ నిజమేనా..? లేదంటే గాసిప్లాగే మిగిలిపోతుందా..? అనేది క్లారిటీ రావాలంటే రష్మిక ఏమైనా స్పందిస్తే కానీ తెలియదు. ప్రస్తుతం రష్మిక ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్న తమిళ సినిమా వారిసు సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
Read Also : Allari Naresh | క్రేజీ టాక్.. స్టార్ హీరో సినిమాలో అల్లరి నరేశ్ ..!
Read Also : Dhamki | ధమ్కీలో ఆర్పీ పట్నాయక్ పాట.. విశ్వక్సేన్ అప్డేట్