రష్మిక మందన్న ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతున్న రొమాంటిక్ ప్రేమకథ ‘ది గర్ల్ ఫ్రెండ్’. దీక్షిత్ శెట్టి మేల్ లీడ్ పోషిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. అల్లు అరవింద్ సమర్పకుడు. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా ట్రైలర్ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈ నెల 25న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానున్నది. సరికొత్త ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతున్నదని, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణన్ వసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, నిర్మాణం: గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్.