Rashmika Mandanna | అగ్ర కథానాయిక రష్మిక మందన్నలో హాస్య చతురత చాలా ఎక్కువ. ఈ అమ్మడు ఎవరితో సంభాషించినా చక్కటి ఛలోక్తులు విసురుతూ నవ్వించే ప్రయత్నం చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, హిందీ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాత్రికేయులు తన పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు సరదాగా సమాధానమిచ్చిందీ భామ. తనకు నరుటో అనే వ్యక్తితో ఎప్పుడో పెళ్లయిపోయిందని, అతన్నే జీవితకాలం ప్రేమిస్తుంటానని బదులిచ్చింది.
రష్మిక సమాధానంతో అక్కడున్న వారంతా అయోమయానికి గురయ్యారు. అసలు ఎవరీ నరుటో అంటూ చర్చించుకున్నారు. సదరు వ్యక్తి జపనీస్ వెబ్‌సిరీస్ ‘నరుటో’లో టైటిల్ రోల్‌ను పోషించిన హీరో అని తెలుసుకొని రష్మిక మందన్న సెన్సాఫ్ హ్యూమర్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ‘నరుటో’ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించుకుంది. తాను కూడా ఈ సిరీస్ అభిమానినని రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్టర్లను పంచుకుంది. అవకాశం వస్తే నరుటో ప్రేయసి పాత్రలో నటించాలనుందని ఓ సందర్భంలో తెలిపింది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప-2’ ‘రెయిన్ బో’ చిత్రాల్లో నటిస్తున్నది.