సోషల్ మీడియా (Social Media)లో ఎప్పుడూ ఏదో ఒక స్టిల్ షేర్ చేస్తుంటుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఈ బ్యూటీ సూపర్ యాక్టివ్ గా సన్‌షైన్ మూడ్‌లో ఉన్నస్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. మెరిసే మల్టీ కలర్ ప్యాంట్, స్లీవ్‌లెస్ టాప్ లో దిగిన బ్లాక్ అండ్ వైట్ స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మీ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కూడా కొద్దిగా మెరుపు జోడించండి..అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్న రష్మిక స్టిల్ ను చూసిన నెటిజన్లు మరిన్ని ఫొటోలున్నాయా అంటూ ఎక్జయిటింగ్ ఎదురుచూస్తున్నారు.
మీరు చాలా అందంగా, హాట్ గా ఉంటారనేది వాస్తవం. రష్మిక ఆధిపత్యం అంటూ ఓ వీరాభిమాని కామెంట్ పెట్టాడు. మీరు నా జీవితంలో మెరుపును జోడించారు అంటూ మరో అభిమాని కామెంట్ పోస్ట్ చేశారు. రష్మిక వేసుకున్న డ్రెస్ ను అనీషా జైన్ (Anisha Jain) డిజైన్ చేయగా..రిధికా మెహ్రా (Ridhika Mehra) రష్మిక హాట్ లుక్‌ను తన కెమెరాలో బంధించారు.
మరోవైపు బుధవారం మధ్యాహ్నం రష్మిక క్యూట్ పెట్ ఆరాతో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. మేము ఒకరినొకరు ఎలా మలచుకున్నామనేది మ్యాజిక్. ఆరా నాకు పెంపుడు జంతువు కంటే చాలా ఎక్కువ. నా బిడ్డ, నా ప్రపంచం..నా చిరునవ్వుకు, నా చురుకుదనానికి కారణం ఆరా.. ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ గా పెట్టింది.
రష్మిక ప్రస్తుతం మిషన్ మజ్ను సినిమా చేస్తుండగా..ఇటీవలే షూటింగ్ పూర్తయింది. మరోవైపు అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బై సినిమాలో నటిస్తోంది రష్మిక. తెలుగులో పుష్పతోపాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేస్తోంది.
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
మరో రీమేక్‌లో మెగాస్టార్ .. సొంత కథలపై చిరంజీవికి నమ్మకం పోయిందా ?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్