Rashmika Mandanna | సినీ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) డీప్‌ఫేక్ వీడియో (Deepfake Video) వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. టెక్నాలజీ దుర్వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేశారు. తన మార్ఫింగ్ వీడియోపై రష్మిక కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఈ డీప్‌ఫేక్ వీడియో ఘటన తర్వాత రష్మిక తొలిసారి పబ్లిక్‌లోకి వచ్చింది.
కోస్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga)తో కలిసి ముంబైలోని టి-సిరీస్ (T-Series) కార్యాలయం నుంచి బయటకు వస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న విలేకర్లు, స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. అయితే, రష్మిక అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. వెంటనే కారులోకి ఎక్కి వెళ్లిపోయింది.
రష్మిక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి బాలీవుడ్ మూవీ యానిమల్ (Animal). స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor) టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) దర్శకత్వం వహిస్తున్నాడు. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
మరోవైపు అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప.. ది రైజ్‌కు కొనసాగింపుగా వస్తోన్న పుష్ప.. ది రూల్‌లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. రష్మిక మందన్నా మరోవైపు ఫీ మేల్ సెంట్రిక్ కథాంశంతో సినిమా కూడా చేస్తోంది. ఈ సినిమాకు రెయిన్ బో (Rainbow) టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌కు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read..
KTR | అదో అవమానకరమైన చర్య.. రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
Nagpur Doctor | టీ ఆలస్యమైందని.. ఆపరేషన్ థియేటర్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన వైద్యుడు
Anand Mahindra | కాలుష్య కోరల్లో ఢిల్లీ.. నివారణకు ఆనంద్ మహీంద్రా సలహా