Nagpur Doctor | టీ ఆలస్యమైందని.. ఆపరేషన్ థియేటర్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన వైద్యుడు
Nagpur Doctor | మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఓ వైద్యుడు (Nagpur Doctor) నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కప్పు టీ ఇవ్వని కారణంగా ఆపరేషన్ థియేటర్ నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు ( Leaves Surgery Midway).
Nagpur Doctor | మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఓ వైద్యుడు (Nagpur Doctor) నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కప్పు టీ ఇవ్వని కారణంగా ఆపరేషన్ థియేటర్ నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు ( Leaves Surgery Midway). ఈ ఘటన స్థానిక మౌదా తహసీల్ (Mauda tehsil )లోని ప్రభుత్వ ఆధీనంలోని ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది.
నవంబర్ 3వ తేదీన 8 మంది మహిళలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ (family planning surgery) కోసం వచ్చారు. ఈ క్రమంలో డాక్టర్ తేజ్‌రంగ్ భలవి నలుగురు మహిళలకు శస్త్రచికిత్సలు పూర్తి చేశారు. ఆ తర్వాత మరో నలుగురికి ఆపరేషన్ చేసేందుకు ముందు అనస్థీసియా ఇచ్చారు. ఈ క్రమంలో ఆ గ్యాప్‌లో వైద్యుడు ఆసుపత్రి సిబ్బందిని టీ కోరాడు. అయితే, వారు టీ ఎంతసేపటికీ ఇవ్వలేదు (Not Being Served Tea ). దీంతో అసహనానికి గురైన వైద్యుడు.. మిగిలిన ఆపరేషన్లు చేయకుండానే అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
వైద్యుడు వెళ్లిపోవడంతో ఆందోళన చెందిన ఆసుపత్రి సిబ్బంది.. ఈ విషయాన్ని వెంటనే జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జిల్లా వైద్యాధికారి మిగిలిన నలుగురు మహిళలకు శస్త్రచికిత్స చేసేందుకు మరో వైద్యుడిని పంపారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్య శర్మ మాట్లాడుతూ.. ఈ కేసు దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా వైద్యుడిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
‘నవంబర్ 3వ తేదీన శుక్రవారం మౌదా తహసీల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. రామ్‌టెక్ తహసీల్‌కు చెందిన ఆర్‌హెచ్ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ తేజ్‌రంగ్ భలవిని ఆపరేషన్ చేయడానికి పిలిపించారు. అతను నాలుగు ఆపరేషన్లు పూర్తి చేశాడు. మరో 4 ఆపరేషన్లను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు నాదృష్టికి తీసుకురావడంతో నేను వెంటనే నాగ్‌పూర్ జిల్లా పరిషత్ ఆరోగ్య అధికారికి ఫోన్ చేసి మిగిలిన ఆపరేషన్ల కోసం వైద్యులను పంపమని అడిగాను. దీంతో వారు మరో వైద్యుడిని పంపారు. ఇది చాలా తీవ్రమైన విషయం. టీ ఇవ్వలేని కారణంగా ఇలా ఆపరేషన్లను మధ్యలోనే వది వెళ్లడం సరికాదు. ఈ ఘటనపై తక్షణమే విచారణకు ఆదేశించాం. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. నివేదిక వచ్చిన తర్వాత సదరు వైద్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని ఆమె వెల్లడించారు.
Also Read..
Hyderabad | ట్యాంక్‌బండ్‌పై కేక్ కటింగ్స్ నిషేధం.. హెచ్చరించిన జీహెచ్ఎంసీ
Varun Raj | అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి
Anand Mahindra | కాలుష్య కోరల్లో ఢిల్లీ.. నివారణకు ఆనంద్ మహీంద్రా సలహా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

