KTR | సినీ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. టెక్నాలజీ దుర్వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పందించారు.
ఓ నేషనల్ ఛానెల్ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. రష్మిక మార్ఫింగ్ వీడియో గురించి ప్రస్తావించారు. అదో అవమానకరమైన చర్యగా అభివర్ణించారు (Its deeply insulting). నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో గురించి వార్తల్లో చూసినట్లు చెప్పారు. అదో చేదు అనుభవమని.. ఓ సెలబ్రిటీని ఈ విధంగా కించపరచడం నిజంగా దారుణమని అన్నారు. ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకువస్తే వాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలపై భారత ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కొందరు ఆకతాయిలు (Rashmika Mandanna) ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు. వీడియోలో రష్మిక బాగా ఎక్స్పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రష్మిక ఏంటి.. ఇలా తయారైంది అంటూ మాట్లాడుకున్నారు. దీనిపై అనుమానం వచ్చిన కొందరు నెటిజన్లు.. అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించినదిగా తేల్చారు. ఆమె వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఒరిజినల్ వీడియో, రష్మిక డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లే కాదు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సీరియస్ అయ్యారు. ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read..
Nagpur Doctor | టీ ఆలస్యమైందని.. ఆపరేషన్ థియేటర్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన వైద్యుడు
Varun Raj | అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి
Hyderabad | ట్యాంక్‌బండ్‌పై కేక్ కటింగ్స్ నిషేధం.. హెచ్చరించిన జీహెచ్ఎంసీ