ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ షూటింగ్లో బిజీగా ఉంది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. కేరళలో జరుగుతున్న తాజా షెడ్యూల్లో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుండగా త్వరలో రష్మిక మందన్న ఓ గ్లోబల్ ఈవెంట్లో సందడి చేయబోతున్నది. జపాన్లోని టోక్యోలో జరగనున్న గ్లోబల్ యానిమే అవార్డ్స్ వేడుకలో రష్మిక మందన్న ప్రజెంటర్గా వ్యవహరించనుంది. ప్రపంచవ్యాప్తంగా యానిమేషన్ రంగంలో అద్భుత ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన సాంకేతిక నిపుణులతో పాటు సినిమాలకు గత పదేళ్లుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు.
భారత్ నుంచి ఈ ఏడాది గ్లోబల్ యానిమే వేడుకలో పాల్గొంటున్న ఏకైక భారతీయ నటి రష్మిక మందన్న కావడం విశేషం. ఇదొక అరుదైన గౌరవమని అంటున్నారు. అయితే 2024లో జరిగిన గ్లోబల్ యానిమే ఈవెంట్లో కూడా రష్మిక మందన్న పాల్గొన్నది. ఈ వేడుకలో భాగమైన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. మరోమారు రష్మిక మందన్న ఈ గ్లోబల్ ఈవెంట్లో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.