మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 00:48:16

అలాగైతే జీవితం వృథా!

అలాగైతే జీవితం వృథా!

కన్నడ కస్తూరి రష్మిక మందన్న సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలు, ఫ్యాషన్‌కు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తనలోని తాత్వికభావాల్ని వ్యక్తం చేసే పోస్ట్‌లు పెడుతుంటుంది. పుస్తకాలు విరివిగా చదివే అలవాటు ఉండటంతో ఈ అమ్మడి మాటలు అభిమానుల్లో ఆలోచనల్ని రేకెత్తించేలా అనిపిస్తాయి. తాజాగా జీవితం, డబ్బు గురించి తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది రష్మికమందన్న. ‘ఇష్టమైన పని చేస్తూ..మనస్ఫూర్తిగా నవ్వుతూ జీవితాన్ని సాగించాలి. మన వృత్తి ఎలాంటిదైనా సరే ఆనందాన్ని వెతుక్కోవాలి. జీవితంలోని ప్రతిక్షణం మీకు ఆనందాన్నో, సుఖాన్నో అందివ్వాలి..లేదా డబ్బునైనా సంపాదించిపెట్టాలి. అవేమీ లేకుండా  ఉంటే జీవితం వృథా. అలాంటి పరిస్థితులొస్తే మన ఆలోచనా విధానాన్ని మార్చుకొని సంతోషాన్ని, డబ్బుని అందించే కొత్త మార్గాన్ని ఎంచుకోవాలి. నేను నమ్మే జీవితపాఠం ఇదే’ అని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది.


logo