Rashmika Mandanna | బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక రష్మిక తీరే మారిపోయింది. తన ఫొటో షూట్లతో అక్కడి హీరోయిన్లను కూడా షాక్‌కి గురిచేస్తున్నది ఈ బెంగళూరు భామ. రీసెంట్గా సముద్రతీరాన పసుపురంగు మోడ్రన్డ్రెస్లో రష్మిక చేసిన ఫొటో షూట్ బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. అక్కడి కుర్రకారుకైతే కలలరాణిగా మారింది రష్మిక. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ‘మీకే అధిక ప్రాధాన్యత.. ఇచ్చుకోండి..’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇక అభిమానులు కామెంట్లతో చెలరేగిపోతున్నారు.
బాలీవుడ్ కెళ్లగానే ఈ మేకోవర్ ఏంటి? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘రోమ్‌లో ఉన్నవాళ్లు రోమన్స్లా బతకాలి.. అనేది పెద్దలమాట. నేను అది కచ్చితంగా ఆచరిస్తా. బాలీవుడ్లో ఎలా ఉండాలో అలా ఉంటేనే అవకాశాలు. అయితే నటిగా నాకంటూ కొన్ని పరిథులున్నాయి. వాటిని మాత్రం అతిక్రమించను. ఏ భాషలో నటిస్తే, ఆ భాష అమ్మాయిగా మారిపోవడం నాకిష్టం’ అని చెప్పకొచ్చింది నేషనల్ క్రష్ .