Rashmika Mandanna | అతడితో నాకు ఎప్పుడో పెళ్లైపోయింది.. రష్మిక షాకింగ్ కామెంట్స్
Rashmika Mandanna | సౌత్ ఇండియాలో స్టార్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ భామ రష్మిక మందన (Rashmika Mandanna). తన అందం, నటనతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. ఈ నటి తాజాగా తనకు పెళ్లైపోయింది అంటూ అందరినీ షాక్ కు గురిచేసింది.
Rashmika Mandanna | సౌత్ ఇండియాలో స్టార్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ భామ రష్మిక మందన (Rashmika Mandanna). తన అందం, నటనతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ సహా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది. కాగా, రష్మిక గురించి కొన్ని రోజులుగా ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్ లో ఉందంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది.
వీరిద్దరూ తరచూ పార్టీలు, వెకేషన్స్ అంటూ కలిసి కనిపించడంతో మీడియాలో కూడా వీరి రిలేషన్ గురించి వరుస కథనాలు వచ్చాయి. అయితే ఆ రూమర్స్ ను ఇద్దరూ కొట్టి పారేశారు. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తన మనసులో ఉన్న వ్యక్తి గురించి రష్మిక బయటపెట్టింది. ఆ వ్యక్తితో తనకు ఇప్పటికే పెళ్లైపోయిందని చెప్పి అందరినీ షాక్ కు గురి చేసింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే..?
ఇటీవలే ఓ కార్యక్రమంలో రాల్గొన్న రష్మికను విలేకరు.. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు..? మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? అని ప్రశ్నించారు. దీనిపై నటి స్పందిస్తూ.. ‘నాకు పెళ్లైపోయింది’ అని చెప్పి అందరినీ షాక్ కు గురిచేసింది. ‘నాకు నరుటో (Naruto)తో పెళ్లైపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంతకీ ఆ నరుటో (Naruto) ఎవరా అని అనుకుంటున్నారా.. జపనీస్ వెబ్ సిరీస్ ‘నరుటో’ లోని ఫేమస్ పాత్ర. ఈ సిరీస్ కు అందులోని పాత్రలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆ పాత్ర రష్మిక ను కూడా ఆకట్టుకున్నట్లుంది. ప్రస్తుతం రష్మిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప 2’(pushpa2) సినిమాతో బిజీగా ఉంది. దీంతోపాటు సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’తోపాటు ‘రెయిన్ బో’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తోంది.
Also Read..
Beijing | 140 ఏళ్ల రికార్డు బద్దలు.. జల ప్రళయంతో విలవిల్లాడుతున్న బీజింగ్
Seema Haider | సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సీమా హైదర్..? మర్డర్ స్టోరీకి ఆడిషన్స్ ఇచ్చిన పాక్ మహిళ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

